F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)

F 18 Collision

F 18 Collision

అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన పైలట్స్ పారాచూట్స్ సాయంతో కిందకు దూకారు. ఇడాహో స్టేట్స్‌మ్యాన్ కథనం ప్రకారం, నలుగురు సిబ్బంది (పైలట్లు) సురక్షితంగా బయటకు దూకారని, వారు పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆ షో అనౌన్సర్ ప్రేక్షకులకు తెలియజేశారు.

నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో చిక్కుకున్న విమానాలు యూఎస్ నేవీ/ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే రెండు EA-18G గ్రోలర్ ఫైటర్ జెట్‌లు. ఇవి F-18 హార్నెట్‌కు చెందిన ఒక అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వేరియంట్. ఎయిర్‌బేస్‌కు సుమారు రెండు మైళ్ల దూరంలో ఈ రెండు జెట్‌లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి మాట్లాడుతూ, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.