Site icon NTV Telugu

Elon Musk: ట్విట్టర్‌లో కొత్త ఫీచర్స్..అప్‌డేట్ ఇచ్చిన మస్క్

Twitter

Twitter

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ శనివారం కొత్త అప్‌డేట్ ఇచ్చారు.”రానున్న నెలల్లో ఇతర దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు చేసే అద్భుతమైన ట్వీట్లను ట్విట్టర్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అలాగే వాటిని ఇతరులకు రికమెండ్ కూడా చేస్తుంది. ఇతర దేశాల్లో ప్రతిరోజూ ఎన్నో అద్భుతమైన ట్వీట్లు ఉంటాయి. మరీ ముఖ్యంగా జపాన్‌ నుంచి” అంటూ మస్క్ పోస్ట్ చేశారు. రికమెండ్ చేయడానికి ముందే వాటిని ట్రాన్స్‌లేట్ చేస్తామని తెలిపారు.

BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్లను బ్లాక్ చేసిన కేంద్రం..

మస్క్‌ ట్విట్టర్ కొనుగోలు చేసిన దగ్గరి నుంచి సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అందులో బ్లూ టిక్‌ కూడా ఒకటి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల ఖాతాలకు వెరిఫై బ్లూ టిక్‌ ఇచ్చేవారు. తాజాగా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను ప్రకటించారు. ఇటీవల కూడా ఆయన కొన్ని అప్‌డేట్లు ఇచ్చారు. ముఖ్యంగా రికమెండెడ్‌ vs ఫాలోడ్‌ ట్వీట్లను తేలికగా కదల్చడం, యూజర్‌ ఇంటర్ఫేస్‌లో మార్పులు, ట్వీట్‌ వివరాల కోసం బుక్‌ మార్క్‌ బటన్‌, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే.. ట్విట్టర్‌లో భారీగా ఉద్యోగాలకు కోతలు పడ్డాయి. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక 7,500 మంది ఉన్న ఉద్యోగుల్ని సగానికి కుదించారు. ఈసారి ఆ సంఖ్యను మరింత తగ్గించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైనా మస్క్ స్పందించారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో 2,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.

Exit mobile version