Site icon NTV Telugu

Meloni-Erdogan Video: చాలా అందంగా ఉన్నారు.. కానీ సిగరెట్ తాగడమే బాగోలేదు.. మెలోనీకి సూచించిన ఎర్డోగన్

Melonierdogan

Melonierdogan

ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి 20 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇటలీ ప్రధాని మెలోని, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సహా తదితరులంతా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్

అయితే శాంతి సదస్సులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్-ఇటలీ ప్రధాని మెలోని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా అందంగా ఉన్నావు.. కానీ ధూమపానం చేయడమే బాగోలేదని మెలోనికి ఎర్డోగన్ సూచించారు. ఇకనైనా సిగరెట్ తాగడం మానేయాలని మెలోనిని ఎర్డోగన్‌ కోరారు. ఈ సందర్భంగా మెలోనిని ఒప్పిస్తున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పక్కనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్

‘‘నువ్వు విమానం నుంచి కిందకు దిగడం నేను చూశాను. నువ్వు చాలా బాగున్నావు. కానీ నేను నిన్ను ధూమపానం మానేయించాలి.’’ అని మెలోనితో ఎర్డోగన్ చెప్పాడని ఇహ్లాస్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసిన వీడియోలో కనిపించింది. సమీపంలో నిలబడి ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నవ్వుతూ కనిపించారు. ఎర్డోగన్‌ మాటలకు మాక్రాన్ జోక్యం పుచ్చుకుని ‘‘అది అసాధ్యం!’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని కూడా హాస్యంతో ప్రతిస్పందించింది. ‘‘నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఎవరినీ చంపాలనుకోవడం లేదు.’’ అని తెలిపారు.

మెలోని 13 ఏళ్ల పాటు సిగరెట్ తాగడం మానేశారు. ఇటీవల మళ్లీ తిరిగి ధూమపానం చేయడం ప్రారంభించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మెలోని చెప్పుకొచ్చారు. మళ్లీ కొత్తగా సిగరెట్ తాగడం మొదలు పెట్టినట్లు తెలిపారు. అయితే ఎర్డోగన్-మెలోని సంభాషణపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల చేస్తున్నారు. సిగరెట్లు తాగడం మానేస్తే బాగుండును అని కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 

Exit mobile version