NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్‌తో భారతీయులకు చిక్కులేనా..? వారి పిల్లలకు పౌరసత్వం డౌటేనా..?

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ప్రస్తుతం భారతీయులకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. వారి పిల్లలు సహజంగా అమెరికా పౌరులుగా మారడంపై అనిశ్చితి నెలకొంది. ‘‘సహజసిద్ధమైన పౌరుడు అంటే ఆ దేశంలో జన్మించిన కారణంగా అమెరికా పౌరసత్వం మారే ఒక ప్రక్రియ. అలాంటి వ్యక్తి తమ జాతికి చెందిన దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటే, వారు తమ జీవిత కాలంలో ఎప్పుడైనా పుట్టిన దేశమైన అమెరికా పౌరసత్వాన్ని ఎంచుకోవచ్చు’’

Read Also: Bihar: లోకో పైలట్ నిర్లక్ష్యం.. రైలు కోచ్‌ల మధ్యలో ఇరుక్కుని కార్మికుడు మృతి

డొనాల్డ్ ట్రంప్ సహజసిద్ధమైన పౌరసత్వాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ట్రంప్, జేడీ వాన్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత తొలి అడుగు ఇమ్మిగ్రేషన్‌‌పై ఉంటుందని తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తారని తెలుస్తోంది. ఈ ఉత్తర్వు ప్రకారం.. పిల్లాడు అమెరికా పౌరసత్వం పొందాలంటే కనీసం తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా అమెరికన్ అయి ఉండాలి లేదా చట్టబద్ధమైన పర్మినెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి. దీని అర్థం ఏంటంటే, అమెరికాలో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక్కరూ కూడా అమెరికన్ సిటిజన్ లేదా పర్మినెంట్ రెసిడెంట్ కాకుంటే వారికి పౌరసత్వం లభించదు.

US రాజ్యాంగంలోని 14వ సవరణలోని సెక్షన్ 1 ప్రకారం “యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన లేదా సహజసిద్ధమైన వ్యక్తులందరూ మరియు దాని అధికార పరిధికి లోబడి, యునైటెడ్ స్టేట్స్ మరియు వారు నివసించే రాష్ట్రం యొక్క పౌరులు. 2022 US జనాభా లెక్కల ప్యూ రీసెర్చ్ యొక్క విశ్లేషణ ప్రకారం, USను తమ నివాసంగా మార్చుకుని 4.8 మిలియన్ల భారతీయ-అమెరికన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 1.6 మిలియన్ల భారతీయ-అమెరికన్లు అమెరికాలో పుట్టి పెరిగారు, వారిని సహజ పౌరులుగా మారారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.