అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలోని ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో చార్లీ కిర్క్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇది కూడా చదవండి: WHO Report: ఈ ఏడు రకాల క్యాన్సర్‌లకు మద్యమే కారణం.. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక
చార్లీ కిర్క్ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఓ దుండుగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. తీవ్రగాయాలు పాలైన చార్లీ కిర్క్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మాస్ షూటింగ్స్‌పై విశ్వవిద్యాలయంలో జరుగుతున్న చర్చా కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది.
ట్రంప్ విచారం..
సన్నిహితుడు చార్లీ కిర్క్ మృతి పట్ల అధ్యక్షుడు టంప్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రూత్‌లో గొప్ప వ్యక్తిని కోల్పోయానంటూ తెలిపారు. సన్నిహితుడు మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. హింసకు పాల్పడే వారి వెంట పడతానని చెప్పారు. తన సన్నిహితుడు సత్యం కోసం అమరవీరుడు అయ్యాడంటూ ప్రశంసించారు. రాజకీయ హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఈ హత్య అమెరికాకు చీకటి రోజుగా అభివర్ణించారు.
భారీ శబ్దం..
చార్లీ ప్రసంగిస్తుండగా ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఒకే షాట్ శబ్దం వినిపించింది. చార్లీ కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఇక శబ్దాల దాటికి ప్రేక్షకులంతా చెదిరిపోయారు. అయితే బుల్లెట్ క్యాంపస్ పైనుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. నల్లటి దుస్తులు ధరించిన ఒకరు కాల్చినట్లుగా సమాచారం. ఉద్దేశ పూర్వకంగానే ఈ హత్యకు పాల్పడినట్లుగా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు.
సంతకాల సేకరణ
ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలతో కూడిన ఫిర్యాదును యూనివర్సిటీ అధికారులకు అందజేశారు. అందుకు విశ్వవిద్యాలయం నిరాకరించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇస్తామని.. కార్యక్రమాన్ని రద్దు చేయలేమని యూనివర్సిటీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది.
New footage shows the shooter on the roof of Utah Valley University’s Losee Center moments before Charlie Kirk was shot. The gunman remains at large as the investigation continues. pic.twitter.com/R4jCtyQxQf
— Geopoliti𝕏 Monitor (@GeopolitixM) September 10, 2025
