Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
- ట్రంప్ డిన్నర్లో దుండగుడు తుపాకీలతో హంగామా
- నిందితుడిని పట్టుకున్న భద్రతా సిబ్బంది
- ట్రంప్‌నకు సంబంధించి మేనిఫెస్టో రాసుకున్న నిందితుడు
- జర్నలిస్ట్ ప్రశ్నించడంతో ట్రంప్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాషింగ్టన్ వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకుపడ్డాడు. అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు కాల్పులకు తెగబడక ముందు తన లక్ష్యానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మినహా అధికారులంతా లక్ష్యమని చెప్పాడు.
అయితే అధ్యక్షుడు ట్రంప్‌పై నిందితుడు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ‘‘ఒక పీడోఫైల్, అత్యాచారి, దేశద్రోహి. ఇకపై నా చేతులు కలుషితం కావడం సహించను’’ అంటూ ట్రంప్‌ను గురించి నిందితుడు రాసినట్లుగా శోధించారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే ఆదివారం సీబీఎస్ న్యూస్‌కు చెందిన జర్నలిస్ట్‌తో ట్రంప్ మాట్లాడుతుండగా.. విలేకరి మధ్యలో కలుగజేసుకుని.. నిందితుడు మీ గురించి ఇలా రాశాడంటూ చదవడం మొదలు పెట్టింది. అంతే ఒక్కసారిగా ట్రంప్ సంయమనం కోల్పోయారు. తానేమీ రేపిస్ట్‌ను కాదని.. అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని.. ఇక చదవడం ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌నకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈ సందర్భం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధం లేదని.. ఆ ఆరోపణల నుంచి పూర్తిగా విముక్తి పొందానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇక షూటర్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు రాడికలైజ్ అయ్యాడు. ముందుగా అతడు క్రైస్తవ విశ్వాసి. తర్వాత యాంటీ క్రిస్టియన్‌గా మారాడు. ప్రస్తుతం మానసిక రోగి అయి ఉండొచ్చు.’’ అని పేర్కొ్న్నారు. అమెరికాలో రాజకీయ హింస పెరగడానికి డెమోక్రటిక్ నాయకుల హేట్ స్పీచే కారణమని.. ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కాల్పుల సమయంలో తాను భయపడలేదన్నారు. కొద్దిసేపు అక్కడే ఉందామని భద్రతా సిబ్బందికి చెప్పినట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఇది మూడో హత్యాయత్నం అని.. మళ్లీ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ట్రంప్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!