Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
- డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్లో విభేదాలు
- ఇరాన్ విషయంలో రెండు మిత్రదేశాల మధ్య వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump – Netanyahu: ఇరాన్ వ్యవహారంలో అగ్రరాజ్యం అమెరికా, దాని చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్ మధ్య తాజాగా చెలరేగిన వ్యూహాత్మక విభేదాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ అత్యంత ఉద్రిక్తంగా, తీవ్ర ఒత్తిడి నడుమ సాగిందని అమెరికన్ మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రచురించాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు దిగాలా? లేక దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా? అనే అంశంపైనే ఇరు దేశాల అధినేతల మధ్య ప్రధానంగా వివాదం నడుస్తున్నట్లు సమాచారం.
ఈ ఫోన్ కాల్ సారాంశాన్ని బట్టి చూస్తే.. ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఒకే తాటిపై లేవనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగకుండా చూసేందుకు చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్‌ను అణచివేయడానికి, ఆ దేశ అణు సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీయడానికి సైనిక చర్యే ఏకైక మార్గమని బలంగా నమ్ముతున్నారు. దాడులు ఆపితే ఇరాన్ మరింత బలోపేతం అవుతుందని ఆయన వాదిస్తున్నారు. ఒకవైపు అమెరికా అరబ్ దేశాల మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందాల వైపు మొగ్గు చూపుతుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై దూకుడుగా వెళ్లడానికే మొగ్గు చూపుతోంది. మిత్రదేశాల మధ్య తలెత్తిన ఈ అంతర్గత విభేదాలు రాబోయే రోజుల్లో పశ్చిమాసియా రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయోననే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!