US Tariff: భారతదేశంపై 25 శాతం ట్యాక్స్ ఎత్తివేయడానికి సిద్ధమైన ట్రంప్..? అమెరికా ట్రెజరీ కార్యదర్శి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariff: భారతదేశంపై అమెరికా విధించిన 25 శాతం సుంకాన్ని (టారిఫ్) భవిష్యత్తులో ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకం అమెరికాకు “చాలా విజయవంతమైందని” పేర్కొన్న ఆయన, పరిస్థితులు అనుకూలిస్తే దీనిని తొలగించే మార్గం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
25 శాతం సుంకం వల్ల రష్యా చమురు కొనుగోళ్లు తగ్గాయన్న అమెరికా
స్కాట్ బెస్సెంట్ ప్రకారం, భారతదేశంపై 25 శాతం సుంకం విధించిన తర్వాత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురు గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే ఈ సుంకాన్ని అమెరికా విజయవంతమైన చర్యగా భావిస్తోందని తెలిపారు. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న ఈ ట్యారిఫ్‌ను శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశం అమెరికాకు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, “ఇప్పుడే ఈ సుంకాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను భావిస్తున్నాను” అని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు, భారత్–అమెరికా మధ్య చర్చలు పురోగమిస్తే 25 శాతం టారిఫ్ కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు, చమురు వ్యాపారం అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
భారతదేశంపై అమెరికా ఎంత సుంకం విధిస్తోంది?
ప్రస్తుతం అమెరికా, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై మొత్తంగా 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. ఇందులో.. సుమారు 25 శాతం సాధారణ సుంకం (భారత ఎగుమతుల్లో దాదాపు 55 శాతంపై ప్రభావం).. ఆగస్టు 2025 నుంచి అమల్లోకి వచ్చిన వచ్చింది 25 శాతం అదనపు ‘చమురు సంబంధిత జరిమానా సుంకం’.. ఈ అదనపు సుంకం ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించాలని అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది.. రష్యా చమురుపై అమెరికా, G7 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి ధరల పరిమితి విధానాన్ని అమలు చేస్తున్నాయి. జనవరి 2026 వరకు బ్యారెల్‌కు సుమారు $47.60 ఉండగా.. ఫిబ్రవరి 1, 2026 నుంచి $44.10కి తగ్గించారు.. నిర్దేశిత ధర కంటే ఎక్కువకు రష్యన్ చమురును విక్రయిస్తే, బీమా, షిప్పింగ్, ఫైనాన్సింగ్ సేవలు అందించరాదనే నిబంధనలు ఉన్నాయి.
500 శాతం సుంకాల బిల్లు, భారత నిర్ణయాలు
ఈ ఒత్తిడుల నేపథ్యంలో భారత్, రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించిందని అమెరికా చెబుతోంది. రిలయన్స్ వంటి ప్రధాన భారతీయ రిఫైనరీలు జనవరి 2026లో రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, భారత్ తన జాతీయ ప్రయోజనాలు, సరసమైన ధరల ఆధారంగానే ఇంధన కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అమెరికాలో ప్రతిపాదిత 500% సుంకాల బిల్లును భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. అయితే, భారతదేశంపై 25 శాతం సుంకం ఎత్తివేత జరిగితే, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా భవిష్యత్ చర్చలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!