Site icon NTV Telugu

Trump: చైనాకు ట్రంప్ మరో హెచ్చరిక.. అదే జరిగితే 155 శాతం సుంకం ఉంటుందని వార్నింగ్

Trumpwarning

Trumpwarning

త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకానున్నారు. దక్షిణ కొరియా వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే చైనాపై 55 శాతం సుంకం విధించిన ట్రంప్.. తాజాగా మరో బాంబ్ పేల్చారు. త్వరలోనే చైనాతో అద్భుతమైన ఒప్పందం జరుగుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం విఫలమైతే మాత్రం 155 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

వైట్‌హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం ఆంథోనీ అల్బనీస్‌‌తో కలిసి ట్రంప్ మాట్లాడారు. ‘‘చైనాతో అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని నేను భావిస్తున్నాను. ఇది గొప్ప వాణిజ్య ఒప్పందం అవుతుంది. ఇది రెండు దేశాలకు అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచానికి అద్భుతంగా ఉంటుంది.’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై ప్రశ్న.. పరుష పదం ఉపయోగించిన కరోలిన్‌ లీవిట్‌

‘‘చైనా మనల్ని చాలా గౌరవంగా చూసుకుంటుందని నేను అనుకుంటున్నాను. వారు సుంకాల రూపంలో మనకు అపారమైన డబ్బు చెల్లిస్తున్నారు. మీకు తెలిసినట్లుగా వారు 55 శాతం చెల్లిస్తున్నారు. ఒక ఒప్పందం కుదుర్చుకోకపోతే నవంబర్ 1 నుంచి మాత్రం 155 శాతం చెల్లించే అవకాశం ఉంది. నేను అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమవుతున్నాను. మాకు చాలా మంచి సంబంధం ఉంది. మేము రెండు వారాల్లో దక్షిణ కొరియాలో సమావేశం కాబోతున్నాము. రెండు దేశాలకు మంచి చేసేదాన్ని మనం రూపొందించబోతున్నామని నేను భావిస్తున్నాను.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

 

Exit mobile version