New York: ట్రంప్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లో న్యాయమూర్తి లా క్లర్క్‌ని అవమానించినందున ఎంగోరాన్ మంగళవారం ట్రంప్‌పై పాక్షిక గ్యాగ్ ఆర్డర్ విధించారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన జేమ్స్ పైన ఈ వారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ధీటుగా సమాధానం ఇచ్చింది. అవన్నీ వాస్తవాలని ఆధారాలు లేకుండా తనపై ట్రంప్ వ్యక్తిగత దాడులు చేస్తున్నాడని పేర్కొన్నది బుధవారం సోషల్ మీడియాలో లా క్లర్క్ ని అవమానించిన కేసు విచారణలో భాగంగా ట్రంప్ కోర్టు కి హాజరు అయ్యారు. కాగా కోర్టు నుండి వెళ్లే ముందు ట్రంప్ జేమ్స్‌పై విరుచుకుపడ్డారు. “డెమొక్రాట్‌లు నడుపుతున్న” న్యాయమూర్తితో “రిగ్డ్” విచారణ కారణంగా తను అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని ట్రంప్ ఫిర్యాదు చేశారు.
Read also:Rishi Sunak’s controversial speech: వివాదంగా మారిన బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు.. ఇది లింగ వివక్షే..!
ట్రంప్ న్యాయస్థానం నుండి వెళ్ళిపోయాక మీడియాతో మాట్లాడిన జేమ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై తను వేసిన $250 మిలియన్ల సివిల్ ఫ్రాడ్ దావాపై ఆమె సపందించారు. ట్రంప్ బెదిరింపులకు నేను భయపడను అని పేర్కొన్నారు. ట్రంప్ షో ఇక ముగిసిపోయినది. అతను నాపైన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అధరాలు లేకుండా నాపైన అభియోగం మోపుతున్నాడు. కేవలం ఉద్దేశపూర్వకంగానే నన్ను విమర్శిస్తున్నారు. ట్రంప్, అతని కుమారులు ఎరిక్ మరియు డాన్ జూనియర్ మరియు ఇతర అధికారులు అనుకూలమైన బ్యాంకు రుణాలు మరియు బీమా నిబంధనలను పొందుతూ వాళ్ళ రియల్ఎ స్టేట్ ఆస్తుల విలువను భారీగా పెంచారని జేమ్స్ ఆరోపించారు. సివిల్ విచారణలో ట్రంప్ జైలుకు వెళ్లే ప్రమాదం లేదు, అయితే జేమ్స్ $250 మిలియన్ జరిమానా చెల్లించాలని అలానే మరియు మాజీ అధ్యక్షుడు అతని కుటుంబని ట్రంప్ సంస్థ నిర్వహణ నుండి తొలగించాలని కోరారు జేమ్స్.