Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
- ట్రంప్ జెనరిక్ ఔషధాల దిగుమతులపై కీలక నిర్ణయం
- జెనరిక్ మందులపై దశలవారీగా 200 శాతం వరకు సుంకాలు
- భారత ఫార్మా కంపెనీలకు సవాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ ఔషధాల దిగుమతులపై కీలక నిర్ణయం ప్రకటించారు. అమెరికాకు దిగుమతి అయ్యే జెనరిక్ (Generic) మందులపై దశలవారీగా 200 శాతం వరకు సుంకాలు (Tariffs) విధించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికాలోనే ఔషధ తయారీని ప్రోత్సహించేందుకు తీసుకున్నదని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ ఔషధాల ఎగుమతిదారుగా ఉన్న భారత్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ ఏమన్నారు?
తన సోషల్ మీడియా వేదిక Truth Socialలో ట్రంప్ ఈ కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. ఆయన వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. తొలి రెండు సంవత్సరాలు అమెరికాకు దిగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై 0% సుంకం కొనసాగుతుంది. మూడో సంవత్సరం నుంచి 100% టారిఫ్ విధిస్తారు. ఆ తర్వాత 200% టారిఫ్ అమలు చేస్తారు. అమెరికాలోనే ఔషధ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయని కంపెనీలను ప్రోత్సహించడం కంటే, దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ఈ నిర్ణయం ఎందుకు?
ట్రంప్ ప్రకారం, అమెరికా ప్రజలకు అవసరమైన కీలక ఔషధాల ఉత్పత్తి విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగా తయారయ్యేలా చేయడమే లక్ష్యం. అయితే, పేటెంట్ కలిగిన బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్”గా పిలుస్తారు. తక్కువ ధరలో నాణ్యమైన జెనరిక్ మందులను ప్రపంచంలోని అనేక దేశాలకు భారత్ సరఫరా చేస్తోంది. అమెరికాలో వినియోగించే జెనరిక్ ఔషధాల్లో సుమారు 40 శాతం పరిమాణం భారత కంపెనీల నుంచే వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38 శాతం వాటాను కలిగి ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక వెల్లడించింది.
భారత ఫార్మా కంపెనీలకు సవాళ్లు
కొత్త టారిఫ్ విధానం అమల్లోకి వస్తే భారత ఫార్మా కంపెనీల ఎగుమతులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడే సంస్థలకు ఇది సవాలుగా మారవచ్చు. అయితే, భారత్-అమెరికా మధ్య గతంలో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో జెనరిక్ ఔషధాలు, వాటి ముడి పదార్థాలకు సంబంధించి ప్రత్యేక చర్చల ద్వారా పరిష్కారాలు తీసుకురావాలని పేర్కొనడం వల్ల భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.
అమెరికాలో భారత జెనరిక్ మందుల ప్రాధాన్యం
భారతీయ కంపెనీలు తయారు చేసే జెనరిక్ మందులు అమెరికాలో లక్షలాది మంది రోగులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. రక్తపోటు (Hypertension), మధుమేహం (Diabetes), డిప్రెషన్, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి వ్యాధుల చికిత్సలో భారత జెనరిక్ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే, గర్భనిరోధక మాత్రల విషయంలో 2024లో అమెరికాలో జారీ చేసిన ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 65 శాతం రెండు భారతీయ కంపెనీలైన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, లుపిన్ తయారు చేసిన మందులేనని అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!