Woman Married Husband Friend: వారిద్దిరూ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ బంధంతో ముడిపడ్డారు. అన్యోన్యమైన కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్యతో సన్నిహితంగా వుండాల్సిన భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. అయినా సహిస్తూ వస్తున్నా ఆమెపై అతనికి అనుమానం తగ్గలేదు. చివరికి ఆమెను వదిలించుకునేందుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. భార్యను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. అయితే ఆమె కుంగిపోలేదు. ధైర్యంతో ముందడుగు వేసింది. ఇప్పుడు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుని ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తోంది. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ అదిఏంటంటే.. అతను మరెవరో కాదు ఆమె మొదటి భర్త స్నేహితుడే. కానీ అతను హిందూ కావడంతో ఆచారాల ప్రకారం వీరిద్దకి వివాహం జరిగింది. దీంతో రుబీనా ఖాన్ కాస్త పుష్పగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాకు చెందిన రుబీనా హల్ద్వానికి చెందిన షోయబ్ ను తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అంతేకాదు వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమకు గుర్తుగా.. ముగ్గురు కొడుకులు ఉన్నారు. అయితే.. కుటుంబాన్ని పోషించడానికి షోయబ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో.. అతనికి ప్రేమ్‌పాల్ గంగ్వార్ పరిచయమయ్యాడు. కాగా, ప్రేమ్‌పాల్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. ఆవిధంగానే.. రుబీనాకు దగ్గరయ్యాడు. వీద్దిపై షోయబ్ కు రుబీనాపై అనుమానం రావడం వల్ల తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. ఆమె ఎవరితో మాట్లాడినా ఆరా తీస్తుండేవాడు. అలా అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. చివరకు ఆమెను వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. వారం రోజుల క్రితం త్రిపుల్ తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి గంటివేసాడు. చేసేదేమి లేక రుబీనా, ప్రేమ్‌పాల్ వద్దకు వెళ్లింది. ఇక వారిద్దరు కలిసి బరేలీకి చేరుకున్నారు. ప్రేమ్‌పాల్ గంగ్వార్‌ను రుబీనా వివాహం చేసుకుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం రుబీనా కాస్త పుష్పాగా పేరు మార్చుకుని అతనితో ఏడు అడుగులు బంధం ఏర్పడింది.
India Vs Aus 3rd T20 Updates Live: ఉప్పల్ లో పరుగుల వరదే.. బ్యాటింగ్ కు అనుకూలంగా పిచ్