Tragic Incident: సింహాం బోనులోకి వెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే..
- సింహాన్ని మరింత దగ్గరగా చూడాలనుకున్న యువకుడు
- చెట్టుపైకి ఎక్కి బోనులోకి వెళ్లిన యువకుడు
- యువకుడి పొదల్లోకి లాక్కెళ్లి చంపేసిన సింహాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రెజిల్‌లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక .. ఓ యువకుడి ప్రాణాలను తీసింది. స్థానికులను ఉలిక్కిపడేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని అరుడా కామరా జూ పార్క్‌లో ఓ యువకుడు సింహాన్ని మరింత దగ్గరగా చూడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బోను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా బోనులోకి దిగాడు. యువకుడి కదలికలను గమనించిన సింహం కొన్ని క్షణాల్లోనే అతడి వద్దకు చేరుకుంది.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
సింహం ఆ యువకుడిని పొదల వైపు లాక్కెళ్లి దాడి చేసింది. జూ సిబ్బంది స్పందించేలోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటన తీవ్రంగా ఉండటంతో అక్కడి సందర్శకులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.
జూ అధికారులు ఈ సందర్భాన్ని ఆవేదనగా ప్రస్తావిస్తూ,“భద్రతా నియమాలను ఉల్లంఘించడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు అసలు చేయకూడదు” అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు హెచ్చరికల్ని పెడచెవిన పెట్టడం బాధాకరమని, క్రూరజంతువుల బోనులకు దగ్గరగా వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మళ్లీ గుర్తుచేసిందని కామెంట్లు చేస్తున్నారు.
A Brazilian teen was mauled to death after climbing into a lion enclosure
Play stupid games… pic.twitter.com/yc0ECWFKpq
— Kenny Webster (@KennethRWebster) December 2, 2025
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!