Site icon NTV Telugu

Tragic Incident: సింహాం బోనులోకి వెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే..

Untitled Design

Untitled Design

బ్రెజిల్‌లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక .. ఓ యువకుడి ప్రాణాలను తీసింది. స్థానికులను ఉలిక్కిపడేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని అరుడా కామరా జూ పార్క్‌లో ఓ యువకుడు సింహాన్ని మరింత దగ్గరగా చూడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బోను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా బోనులోకి దిగాడు. యువకుడి కదలికలను గమనించిన సింహం కొన్ని క్షణాల్లోనే అతడి వద్దకు చేరుకుంది.

సింహం ఆ యువకుడిని పొదల వైపు లాక్కెళ్లి దాడి చేసింది. జూ సిబ్బంది స్పందించేలోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటన తీవ్రంగా ఉండటంతో అక్కడి సందర్శకులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.

జూ అధికారులు ఈ సందర్భాన్ని ఆవేదనగా ప్రస్తావిస్తూ,“భద్రతా నియమాలను ఉల్లంఘించడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు అసలు చేయకూడదు” అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు హెచ్చరికల్ని పెడచెవిన పెట్టడం బాధాకరమని, క్రూరజంతువుల బోనులకు దగ్గరగా వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మళ్లీ గుర్తుచేసిందని కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

<blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”en” dir=”ltr”>NEW: Brazilian teen killed after climbing into lion enclosure at zoo <a href=”https://t.co/yDT4v6z3R1″>pic.twitter.com/yDT4v6z3R1</a></p>&mdash; Welch 🇺🇲 (@RonTit4tat3) <a href=”https://twitter.com/RonTit4tat3/status/1995656461553443038?ref_src=twsrc%5Etfw”>December 2, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

Exit mobile version