NTV Telugu Site icon

China Tornado: భారీ టోర్నాడో.. ఐదుగురు మృతి.. 100 మందికి గాయాలు

Trodo

Trodo

భారీ టోర్నాడో తూర్పు చైనాను హడలెత్తించింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 100 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని ఒక పట్టణాన్ని సుడిగాలి భీకరంగా తాకింది. దీని కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పైకప్పులు కూలిపోవడం, చెట్లు నేలకూలడం, చెత్తాచెదారం పడి ఉండటంతో భారీ నష్టాన్ని కలిగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అతి పెద్ద విధ్వంసం సృష్టించి వెళ్లిపోయింది.

షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డోంగ్మింగ్ కౌంటీని టోర్నడో తాకింది. దీంతో భారీ నష్టం కలిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానిక ప్రభుత్వం కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అత్యవసర కార్యకలాపాలను ప్రారంభించింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కైయువాన్‌లో 2,820 గృహాలు దెబ్బతిన్నాయని నివేదక అందింది.

పరిశోధకుల ప్రకారం.. చైనాను సగటున సంవత్సరానికి 100 టోర్నడోలు సంభవిస్తుంటాయి. 1961 నుంచి కనీసం 1,772 మరణాలు సుడిగాలి వలన నమోదయ్యాయి. ఏప్రిల్‌లో వచ్చిన సుడిగాలి గ్వాంగ్‌జౌను తాకింది. అప్పుడు ఐదుగురు మరణించారు. 33 మంది గాయపడ్డారు.