NTV Telugu Site icon

Titanic Submersible: సముద్రగర్భంలో “టైటానిక్ సబ్‌మెర్సిబుల్” విషాదం.. పేలుడు క్షణాల ఆడియో వైరల్..

Titanic Submersible

Titanic Submersible

Titanic Submersible: సముద్ర గర్భంలో దాగున్న టైటానిక్ ఓడ శిథిలాలను చూడటానికి వెళ్లిన ‘‘టైటాన్ సబ్‌మెర్సిబుల్’’ విషాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. సముద్ర గర్భంలోకి వెళ్లిన కొద్ది నిమిషాల లోపే ఈ టైటాన్ క్యాప్సూ్ల్,సముద్ర నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఇంప్లోడ్ అయింది. 2023లో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత బ్రిటిష్ సాహసికుడు హమీష్ హార్డింగ్, యూకేకి చెందిన తండ్రి కొడుకులు షాజాదా, సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ జాతీయుడు పాల్-హెన్రీ నార్జియోలెట్,ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ CEO స్టాక్‌టన్ రష్ ప్రాణాలు కోల్పోయారు. తాము చనిపోతున్నామనే విషయం తెలియకుండానే చనిపోయారు. అంతా క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది.

Read Also: Noise Master Buds: మార్కెట్‌లోకి నాయిస్ మాస్టర్ బడ్స్.. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

ఇదెలా ఉంటే, ఈ భారీ పేలుడుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆడియోని విడుదల చేసింది. డిఫెన్స్ విజువల్ ఇన్ఫర్మెషన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్(DVIDS) శుక్రవారం దీనిని విడుదల చేసింది. 20 సెకన్ల పాటు విస్పోటనానికి సంబంధిచిన శబ్ధాలు ఇందులో వినవచ్చు. జూన్ 18, 2023న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఉన్న టైటానిక్ శిథిలాన్ని చేరుకోవడానికి ముందు జలాంతర్గామి పేలిపోయిన శబ్దం అని అధికారులు చెప్పారు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఓషన్ గేట్ సంస్థకు చెందిన ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్ నీటి పీడనం తట్టుకోలేక విస్పోటనం చెందింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం నుంచి 900 మైళ్ల దూరంలోని లంగర వేసిన పాసివ్ అకౌస్టిక్ ద్వారా ఈ ప్రమాద శబ్ధాలు రికార్డ్ అయ్యాయి. ఇది టైటాన్ ఇంప్లోజన్ అనుమానిత శబ్ధాన్ని వెల్లడిస్తుందని యూఎస్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. ఈ పేలుడు తర్వాత టైటాన్ క్యాప్సూల్ శిథిలాలను వెలికి తీశారు. మృతులకు సంబంధించిన కొన్ని రక్తపు, మాంసపు ముద్దలు తప్పితే ఏమీ మిగలలేదు. నాలుగు రోజుల తర్వాత నీటి అడుగు నుంచి శిథిలాలను యూఎస్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది.