Titan Tragedy: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ సముద్రం లోపలికి వెళ్లి పేలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సమయంలో టైటాన్ లో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహించే టైటాన్ పేలిపోవడం అందులోని వారు చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. చివరకు వారి మృతదేహాలు కూడా లభించని విధంగా పేలుడు సంభవించింది. వారి శరీర భాగాలకు చెందిన అవశేషాలు మాత్రమే టైటాన్ శకలాల్లో లభించాయి.
ఇదిలా ఉంటే ప్రమాదం జరిగే కొన్ని సెకన్ల ముందు అందులోని ఐదుగురికి తాము చనిపోతున్న విషయం అర్థమైందని స్పానిష్ ఇంజనీర్, అండర్ వాటర్ నిపుణుడు జోస్ లూయిస్ మార్టిన్ స్పానిష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 48-71 సెకన్ల ముందు వారు తమ విధిని తెలుసుకున్నారని అన్నారు. పూర్తి చీకటిలో, అనూహ్యమైన భయంతో అందులోని వారు చివరి క్షణాలను గడిపారని పేర్కొన్నారు. జూన్ 18న టైటానిక్ షిప్ ను చూసేందుకు టైటాన్ అట్లాంటిక్ మహాసముద్రం లోతుల్లోకి వెళ్లడం ప్రారంభించింది. కేవలం 1.45 గంటలకు సముద్రంపై ఉన్న ఓడతో సంబంధాల కోల్పోయింది.
Read Also: MLA Sridhar Babu: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై.. కాంగ్రెస్‌పై కక్ష సాధింపు చర్యలు చేపడతున్నాయి
ప్రస్తుతం జోస్ లూయిస్ మార్టిన్ విశ్లేషన ప్రకారం.. టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రయాణ సమయంలో విద్యుత్ లోపం సంభవించింది. ఫలితంగా టైటాన్ తన ట్రస్ట్ ను కోల్పోయింది. దీంతో ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా తన రేఖంశ స్థిరత్వాన్ని కోల్పోయింది. దీంతో సుమారు 5,500 లోతు నుంచి సముద్ర అడుగుభాగంలో పడిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో టైటాన్ అనియంత్రితంగా తిరుగుతుంది, నియంత్రించడం అసాధ్యంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో బరువును తగ్గించడానికి, ఉపరితలంపైకి రావడానికి రూపొందించిన అత్యవసర లివర్ పనికి రాదని మార్టిన్ తెలిపారు. అందులోని వారు చీకటి, భయం, ఆవేదనతో ఉంటారు, వారి పరిస్థితి ఓ హర్రర్ సినిమాను తలపిస్తుందని మార్టిన్ అన్నారు.
టైటాన్ పేలుడుకు ముందు 48-71 సెకన్ల మందు వారు తమ మరణాన్ని ఊహించారని, దాదాపుగా 9000 అడుగుల లోతులో తీవ్రమైన పీడనం టైటాన్ కార్బన్-ఫైబర్ ఉపరితలాన్ని నలిపేసి పేలుడుకు దారి తీసిందని మార్టిన్ తెలిపారు. 48 సెకన్ల నుంచి ఒక నిమిషం మధ్యలో ‘ఇంప్లోజన్’ అనే పేలుడు సంభవించి క్షణాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓషన్‌గేట్ సీఈఓ మరియు టైటాన్ పైలట్ స్టాక్‌టన్ రష్, ఫ్రెంచ్ టైటానిక్ నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్, బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, పాకిస్థానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్ మరియు అతని 19 ఏళ్ల కుమారుడు సులైమాన్ దావూద్ ఉన్నారు.