Three women shot dead in Rome cafe Including Italy PM Friend: ఇటలీ రాజధాని రోమ్‌లో ఒక దుండగుడు జరిగిన కాల్పుల్లో.. ఆ దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఫిడెన్ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అపార్ట్‌మెంట్ కమిటీ రెసిడెంట్స్ కమిటీ సమావేశాన్ని ఎలా నిర్వహించాలని, ఏయే అంశాలపై చర్చించాలన్న విషయంపై చర్చలు జరిపేందుకు కొందరు కమిటీ సభ్యులు ఆ కేఫ్‌లో సమావేశం అయ్యారు. ఇంతలోనే ఓ వ్యక్తి కేఫ్‌లోకి దూరి, మీ అందరినీ చంపేస్తానంటూ అరుస్తూ, ఒక్కసారిగా వారిపై కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు చాకచక్యంగా అతడ్ని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Umbrella Controversy: సీఎం స్టాలిన్ సతీమణికి దేవుని గొడుగు …వివాదం అవుతున్న వ్యవహారం
ఈ సంఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందిస్తూ.. చనిపోయిన వారిలో తన స్నేహితురాలు నికొలెట్టా గొలిసానో (50) ఉందని పేర్కొంది. ఆమెతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది. నికొలెట్టా ఒక ప్రొటెక్టివ్ మదర్, సిన్సియర్ ఫ్రెండ్, ఒక శక్తివంతమైన మహిళ అని.. ఆమె ఇలాంటి చావుకి అర్హురాలు కాదని పేర్కొంది. తను ఎప్పుడూ సంతోషంగా ఉండే మహిళ అని, కొన్ని వారాల క్రితమే ఆమె తన 50వ పుట్టినరోజు జరుపుకుందని తెలిపింది. ఆమెలాంటి స్నేహితురాలిని కోల్పోవడం బాధాకరంగా ఉందని తెలిపింది. అటు.. రోమ్ మేయర్ రాబర్టో ఈ ఘటనని ‘గ్రేవ్ ఎపిసోడ్ ఆఫ్ వయోలెన్స్’గా పేర్కొంటూ.. సోమవారం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. మరోవైపు.. కాల్పులు జరిపిన వ్యక్తి (57)ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో అతనికి కమిటీ సభ్యులతో విభేదాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
కాగా.. కేఫ్‌లో చర్చలు జరిపిన సభ్యుల్లో కమిటీ వైస్-ప్రెసిడెంట్ లూసియానా సియోర్బా కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యక్తి కేఫ్‌లోకి ఎంటరైన వెంటనే, మీ అందరినీ చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. అనంతరం తుపాకీ బయటకు తీసి, కాల్పులు జరిపాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాల్పులు జరిపాక స్థానికులు అతడ్ని అదుపులోకి తీసుకొని, అతనిపై దాడి చేసినట్టు తెలిసింది. ఇంతలో పోలీసులు చేరుకొని, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.