Site icon NTV Telugu

Pakistan-Afghan War: పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 8 మంది మృతి

Pakistan Afghan War

Pakistan Afghan War

పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు తీవ్ర అవుతున్నాయి. పాకిస్థాన్ వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర నష్టం జరుగుతోంది. తాజా దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా, పరూన్‌గా గుర్తించారు. మరో ఐదుగురు స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Priya Prakash : బాబోయ్.. టాప్ లేకుండా చూపించేసిన ప్రియా ప్రకాశ్

వచ్చే నెలలో పాకిస్థాన్-శ్రీలంకతో జరిగే త్రి-దేశాల సిరీస్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్థాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్లినట్లుగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. ఒక సమావేశంలో ఉండగా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడిందని.. ఇది పిరికి దాడిగా ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఈ ఘటన తర్వాత ఆప్ఘనిస్థాన్ త్రి-దేశాల సిరీస్ నుంచి వైదొలిగింది.

ఇది కూడా చదవండి: Off The Record: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోటి వైసీపీ నేతలతోనే కయ్యాలు పెట్టుకుంటున్నారా..?

పాకిస్థాన్ వక్ర బుద్ధిని చూపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటలకే పాకిస్థాన్.. ఆఫ్ఘానిస్తాన్‌పై వైమానిక దాడులకు తెగబడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి ఆఫ్ఘనిస్థాన్ లోని పాక్టికా ప్రావిన్సులోని అనేక జిల్లాలపై దాడులు చేసినట్లు తాలిబాన్ తెలిపింది. అర్గున్, బెర్మల్ జిల్లాల్లోని అనేక ఇళ్లపై ఈ దాడులు జరిగినట్లు ఆఫ్ఘానిస్థాన్ మీడియా టోలోన్యూస్ నివేదించింది.

 

Exit mobile version