Site icon NTV Telugu

విచిత్రంః ప్ర‌పంచంలో వ‌ర్షం కుర‌వ‌ని గ్రామం ఎక్క‌డుందో తెలుసా?

నీరు ప్రజలకు జీవనాధారం.  నీరు లేకుండా మనిషి మనుగడ సాగించడం చాలా కష్టం.  చాలా ప్రాంతాల్లో మనిషి వర్షం నీటిపై ఆధారపడి జీవనం సాగిస్తుంటాడు.  భూమిపై ఏదో ఒక సమయంలో తప్పని సరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  కానీ, భూమిపై ఉన్న ఆ గ్రామంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్షం చుక్క‌కూడా కుర‌వ‌లేద‌ట‌.  దీనికి కార‌ణం లేక‌పోలేదు.  ఈ గ్రామం భూమికి 3200 మీట‌ర్ల ఎత్తులో ఉన్న ఓ కొండ‌పై ఉన్న‌ది.  

Read:

అంటే ఈ గ్రామం మాములు మేఘాల‌కంటే ఎత్తులో ఉన్న‌ది.  మేఘాల కంటే ఎత్తులో ఉండ‌టం వ‌ల‌న ఈ గ్రామంలో అస‌లు వ‌ర్‌సం అనేది కుర‌వ‌దు.  ఉద‌యం మొత్తం ఎండ‌తో, రాత్రి చ‌లితో అక్క‌డి ప్ర‌జ‌లు జీవ‌నం సాగిస్తున్నారు.  ఇక్క‌డివి వ‌చ్చే టూరిస్టులు మేఘాల‌ను త‌మ కెమేరాలో బందిస్తుంటారు.  ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ఉన్న ఈ గ్రామం పేరు అల్ హుతైబ్‌.  ఇది యెమ‌న్ రాజ‌ధాని స‌నా కూత‌వేటు దూరంలో ఉన్న‌ది.   

Exit mobile version