NTV Telugu Site icon

4-Digit PINs: అత్యంత సాధారణ 4-డిజిట్ పిన్స్ ఇవే.. లిస్టులో మీది ఉంటే వెంటనే మార్చుకోండి..

10 Most Common 4 Digit Pins, Cyber Attacks

10 Most Common 4 Digit Pins, Cyber Attacks

4-Digit PINs: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అవుతోంది. అరచేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలా అన్ని వ్యవహారాలు చక్కబడుతున్నాయి. బ్యాంకింగ్, పేమెంట్స్, షాపింగ్స్ ఇలా అన్ని మొబైల్ ద్వారా చేయగలుగుతున్నాం. అయితే ఇదే సమయంలో సైబర్ దాడుల సంఖ్య కూడా పెరిగింది. కేటుగాళ్లు మనకు తెలియకుండానే మన అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులు ఏడాదికి 33 శాతం పెరిగినట్లు తేలింది. ఇందులో భారత్ కూడా అత్యంత లక్ష్యంగా ఉన్న దేశాల్లో ఒకటి అని చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక తెలిపింది. కంప్యూటర్ సిస్టమ్స్, నెట్‌వర్క్‌లలో బలహీనతలు కనుగొనడం ద్వారా సైబర్ దాడులకు పాల్పడే నేరస్థులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ఫిషింగ్ స్కామ్‌లు, ర్యాన్సమ్‌వేర్ వంటి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

Read Also: Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..

ఏదైనా సిస్టమ్‌ని ఉల్లంఘించేందుకు బలహీనమైన పిన్ సులభమైన మార్గంగా ఉంది. సాధారణంగా ‘‘1234’’, ‘‘0000’’ వంటివి బలహీనమైన పిన్‌లు‌గా ఉపయోగపడుతున్నాయి. ఇదే సైబర్ ఎటాక్స్‌కి కారణమవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అధ్యయనం ప్రకారం.. 3.4 మిలియన్ పిన్‌లను అధ్యయనం చేసిన తర్వాత అత్యంత సాధారణంగా వాడే పిన్‌లుగా ఇవి తేలాయి.

1234
1111
0000
1212
7777
1004
2000
4444
2222
6969

సులభంగా ఈ PINని ఊహించడం ద్వారా సైబర్ నేరగాళ్లు మన సిస్టమ్‌లోకి చొరబడుతున్నారు. నైపుణ్యం కలిగిన హ్యాకర్లు ఈ పాస్‌కోడ్ అంచనాలతో వీటిని ఛేదించగలరు. పుట్టిన సంవత్సరాలు, వ్యక్తిగత సమాచారం లేదా పదేపదే ఒకే పాస్‌వర్డ్‌లను ఉపయోగించకూడదని సైబర్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

అతి తక్కువ సాధారణమైన 4-అంకెల పిన్‌లు ఇవే..
8557
8438
9539
7063
6827
0859
6793
0738
6835
8093
జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, పాస్ కోడ్‌లను ఇప్పటికీ కూడా హ్యాక్ చేయవచ్చు. అదనపు భద్రత కోసం పాస్‌వర్డ్ మేనేజర్‌లను వాడాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.