ఆప్ఘాన్ తాలిబాన్‌ల వశం అయినప్పటి నుంచి అక్కడ జనజీవనం స్తంభించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడి ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాబూల్‌లోని మిలటరీ ఆసుపత్రి సమీపంలోమంగళవారం భారీ పేలుడు శబ్దంతో పాటు కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుళ్ల ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించి తాలిబాన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
అయితే ఈ పేళ్లులు ఎందుకు జరిగాయో ఎవ్వరికి స్పష్టమైన సమాచారం లేదు. అయితే తాలిబాన్ సైనిక శిక్షణ కేంద్రంలో ఏమైనా మిస్ ఫైర్ అయి పేలుళ్లు జరిగాయా అనేది తెలియాల్సి ఉంది. తాలి బాన్‌ల పనా లేదా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చర్యనా అనే దానిపై స్పష్టత లేదు. తాలిబాన్ ప్రతినిధులు ప్రకటన చేసే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని రాయిటర్స్ అభిప్రాయ పడింది. ఆగ స్టులో కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మసీదులు,ఇతర లక్ష్యాలపై వరుస దాడులు చేసిన ఇస్లామిక్ స్టేట్, 2017లో 400 పడకల ఆసుపత్రిపై దాడిచేయడంతో 30 మందికి పైగా మరణించారు.
