Site icon NTV Telugu

Small Holes In Smartphones: ఆ చిన్న రంధ్రం ఏం పని చేస్తుందో తెలుసా?

Smartphones Small Hole Role

Smartphones Small Hole Role

The Role Of Small Holes In Smartphones: స్మార్ట్‌ఫోన్లలో ఒక చిన్న రంధ్రం ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. ఇది ఫోన్ పైభాగంలో లేదా కింద చార్జింగ్ పోర్ట్ పక్కన ఉంటుంది. కొన్ని ఫోన్లలో ఇది సెల్ఫీ కెమెరా పక్కన లేదా వెనుకవైపు ఫ్లాష్‌లైట్ పక్కన కూడా మనం చూడొచ్చు. అయితే.. ఈ రంధ్రం ఎందుకు? దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? అనే విషయం మాత్రం చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఫోన్ లోపలికి ఎయిర్ వెళ్లడం కోసమే దీనిని ఏర్పాటు చేసి ఉంటారని కొందరు అనుకుంటుంటారు. కానీ.. అసలు వాస్తవం అది కాదు. దీని వెనుక మరో కారణం ఉంది. అదేంటంటే..

స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి విడుదలైన తొలినాళ్లలో.. వాయిస్ సమస్యల్ని ఎదురయ్యాయి. చాలామంది ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో ఒక రకమైన శబ్దం వచ్చేదని, దాని వల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించేవి కాదని కంప్లైంట్ చేశారు. దీనిని నాయిస్ డిస్ట్రర్బెన్స్‌గా గమనించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు.. ఆ తర్వాత నుంచి తమ ఫోన్లలో చిన్న రంధ్రం ఏర్పాటు, ఆ మోడల్స్‌ని రిలీజ్ చేశారు. అప్పట్నుంచి నాయిస్ డిస్ట్రర్బెన్స్ సమస్య తలెత్తలేదు. ఆ రంధ్రంలో ఓ మినీ మైక్రోఫోన్ ఉంటుంది. అది నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్‌గా పని చేస్తుంది. దాని వల్లే ఎలాంటి అంతరాయం లేకుండా, ఫోన్‌లో మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపిస్తాయి.

Exit mobile version