Site icon NTV Telugu

సమోవా దీవిలో న్యూ ఇయర్‌ వేడుకలు

భారత్ లో మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర ఘడియలు రానుండగా, 2022 ఏడాదికి పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలో అందరికంటే ముందు స్వాగతం పలికాయి. పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికన్నా ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది. టోంగా, కిరిబాటి దీవులతో పాటు న్యూజిలాండ్ కూడా 2022కు ఘనంగా స్వాగతం పలికింది.

Read Also:APSRTC ఉద్యోగులకు న్యూ ఇయర్‌ కానుక

న్యూజిలాండ్ లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. రంగురంగుల బాణసంచా వెలుగులతో ఆకాశం మెరిసిపోయింది. ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. మరికొన్ని గంటల్లో భారత్‌లో కూడా న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆంక్షల మధ్య ఈ సారి ఇళ్లలోనే న్యూ ఇయర్‌ వేడుకలను నిర్వహించుకోనున్నారు.

Exit mobile version