Best Cities In The World: ప్రపంచంలో టాప్-50 బెస్ట్ నగరాల జాబితా విడుదలైంది. టైమ్ అవుట్ ఈ జాబితాను వెల్లడించింది. నగరంలోని ఆహారం, కల్చరల్ అట్రాక్షన్, నైట్ లైఫ్ వంటి అంశాల ఆధారంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ రెండవ స్థానంలో నిలిచింది. లండన్, బెర్లిన్ మరియు మాడ్రిడ్ వరసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి.
భారత్ నుంచి కేవలం ముంబై మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ముంబై 12 స్థానంలో నిలిచింది. టైమ్ అవుట్ మ్యాగజైన్ 20,000 మంది పట్టణ నివాసితులను సర్వే చేసి ప్రపంచంలో బెస్ట్ సిటీస్ జాబితాను రూపొందించింది. నగరంలోని వాతావరణం, నిర్మాణ అద్భుతాలు, సాంస్కృతిక గొప్పతనంతో సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఫుడ్, నైట్ లైఫ్ వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు.
Read Also: China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి..
టాప్-50: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలు:
1. న్యూయార్క్ నగరం, USA
2. కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా
3. బెర్లిన్, జర్మనీ
4. లండన్, UK
5. మాడ్రిడ్, స్పెయిన్
6. మెక్సికో సిటీ, మెక్సికో
7. లివర్‌పూల్, UK
8. టోక్యో, జపాన్
9. రోమ్, ఇటలీ
10. పోర్టో, పోర్చుగల్
11. పారిస్
12. ముంబై
13. లిస్బన్
14. చికాగో
15. మాంచెస్టర్
16. సావో పాలో
17. లాస్ ఏంజిల్స్
18. ఆమ్స్టర్డ్యామ్
19. లాగోస్
20. మెల్బోర్న్
21. నేపుల్స్
22. సింగపూర్
23. మయామి
24. బ్యాంకాక్
25. లిమా
26. బుడాపెస్ట్
27. బీజింగ్
28. దుబాయ్
29. మాంట్రియల్
30. గ్లాస్గో
31. సిడ్నీ
32. బ్యూనస్ ఎయిర్స్
33. కౌలాలంపూర్
34. మనీలా
35. సియోల్
36. హనోయి
37. శాన్ ఫ్రాన్సిస్కో
38. బార్సిలోనా
39. అబుదాబి
40. న్యూ ఓర్లీన్స్
41. ఫిలడెల్ఫియా
42. ఆస్టిన్
43. బోస్టన్
44. అక్రా
45. మార్సెయిల్
46. తైపీ
47. ఇస్తాంబుల్
48. ఒసాకా
49. హాంకాంగ్
50. వాంకోవర్
