Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు
- అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- అవాక్కైన నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరైనా చనిపోతే సహజంగా ఏం చేస్తారు. ఇంట్లో వాళ్లతో పాటు బంధువులు.. ఇరుగు పొరుగు వారు కూడా ఏడుస్తారు. చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుని దు:ఖంలో మునిగిపోతారు. కానీ అందుకు భిన్నంగా శవం దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. భౌతికకాయం ముందు అశ్లీల డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి థమ్మరత్‌లోని రోన్ ఫిబున్ జిల్లాలో 59 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. శవపేటికను వాట్ తెప్పానోమ్ చుయత్ ఆలయంలో ఉంచారు. అయితే చనిపోయే ముందు మృత్యుడు కుటుంబ సభ్యులను ఒక కోరిక కోరాడు. తాను చనిపోయినప్పుడు దు:ఖంతో కాకుండా.. తన జీవితాన్ని ఆనందంతో గుర్తించుకోవాలని కోరాడు. దీంతో మృత్యుడి కోరిక మేరకు కుటుంబ సభ్యులు.. ముగ్గురు కోయోట్ నృత్యకారులను పిలిచి డ్యాన్స్ చేయింపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏడ్వాల్సిన చోట.. సంతోషంగా ఉండడంతో వీడియో ట్రెండింగ్‌గా మారింది.
Also Read
- Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
వీడియో వైరల్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మృతుని కోరిక తీర్చడం మంచిదే గానీ.. మరికొందరు అంత్యక్రియలు సమయంలో ఇలా చేయడం అనుచితమని విమర్శించారు. పైగా ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలు హాజరు కావడం భావ్యమా? అని ఇంకొందరు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!