Site icon NTV Telugu

Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు

Viral Video

Viral Video

ఎవరైనా చనిపోతే సహజంగా ఏం చేస్తారు. ఇంట్లో వాళ్లతో పాటు బంధువులు.. ఇరుగు పొరుగు వారు కూడా ఏడుస్తారు. చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుని దు:ఖంలో మునిగిపోతారు. కానీ అందుకు భిన్నంగా శవం దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. భౌతికకాయం ముందు అశ్లీల డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి థమ్మరత్‌లోని రోన్ ఫిబున్ జిల్లాలో 59 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. శవపేటికను వాట్ తెప్పానోమ్ చుయత్ ఆలయంలో ఉంచారు. అయితే చనిపోయే ముందు మృత్యుడు కుటుంబ సభ్యులను ఒక కోరిక కోరాడు. తాను చనిపోయినప్పుడు దు:ఖంతో కాకుండా.. తన జీవితాన్ని ఆనందంతో గుర్తించుకోవాలని కోరాడు. దీంతో మృత్యుడి కోరిక మేరకు కుటుంబ సభ్యులు.. ముగ్గురు కోయోట్ నృత్యకారులను పిలిచి డ్యాన్స్ చేయింపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏడ్వాల్సిన చోట.. సంతోషంగా ఉండడంతో వీడియో ట్రెండింగ్‌గా మారింది.

వీడియో వైరల్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మృతుని కోరిక తీర్చడం మంచిదే గానీ.. మరికొందరు అంత్యక్రియలు సమయంలో ఇలా చేయడం అనుచితమని విమర్శించారు. పైగా ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలు హాజరు కావడం భావ్యమా? అని ఇంకొందరు ప్రశ్నించారు.

Exit mobile version