Site icon NTV Telugu

చదివేది 9వ తరగతి… ఈ అమ్మాయి టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Gollapalli Pragna Sree

ఉగాండాలో ఓ తెలుగు అమ్మాయి చిన్నతనంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటోంది. చదివేది 9వ తరగతి అయినా ఉగాండా అధ్యక్షుడి చేత ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 14 ఏళ్ల వయసున్న తెలుగు అమ్మాయి గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో విద్యను అభ్యసిస్తోంది. అయితే ఆ అమ్మాయికి వివిధ దేశాలు తిరగాలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె ఆహార ప్రియురాలు. అటు క్రీడల్లోనూ ప్రజ్ఞశ్రీ ప్రతిభను చాటుతోంది. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి ఔట్ డోర్ గేమ్స్‌తో పాటు చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లోనూ తన ప్రావీణ్యం చూపుతోంది.

Read Also: అక్క విడాకులు.. చెల్లెలు ప్రొఫైల్ పిక్ వైరల్

అయితే కొత్త విషయాలు నేర్చుకోవడంతో ప్రజ్ఞశ్రీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ నేపథ్యంలో ఉగాండా జాతీయ గీతాన్ని వారి భాషలోనే నేర్చుకుని ఔరా అనిపించింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగమ్మాయి ఉగాండా జాతీయ గీతాన్ని పాడటంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రముగ్ధుడయ్యారు. దీంతో స్వయంగా ఆ అమ్మాయిని పిలిచి ఉగాండా దేశ అధ్యక్షుడు యోవరి కగుట ముసవెని అభినందనలు తెలియజేశారు.

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగాండా పర్యటనకు వెళ్లినప్పుడు స్వయంగా గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ పూలబొకే ఇచ్చి స్వాగతం పలకడం విశేషం. ఇంతటి టాలెంట్ గల అమ్మాయికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. ప్రజ్ఞశ్రీ నెమలి, మూడు కుక్కపిల్లలు, సింహం పిల్ల, తాబేలు, ఏనుగు వంటి వాటిని ముద్దుగా పెంచుకుంటోంది.

తాబేలుకు మధు అని, సింహం పిల్లకు శ్రీ అని, ఏనుగుకు నైకటో అని, కుక్క పిల్లలకు ఫ్లాష్, రోచర్, ఒరియో అని పేర్లు పెట్టుకుంది ప్రజ్ఞశ్రీ.

Exit mobile version