Zaima Rahman: ట్రెండింగ్‌గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!
- బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ప్రభంజనం
- ఏకపక్షంగా తారిక్ రెహమాన్ వైపు నిలబడ్డ ప్రజలు
- ట్రెండింగ్‌గా తారిక్ రెహమాన్ కుమార్తె జైమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసి ఇటీవలే బంగ్లాదేశ్‌కు వచ్చారు. చాలా తక్కువ సమయంలోనే తారిక్ రెహమాన్ ఇంత పెద్ద విజయం సాధించడం హాట్ టాఫిక్ మారింది. ఇక ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో తారిక్ రెహమాన్ కుమార్తు జైమా జర్నాజ్ రెహమాన్ ట్రెండింగ్ మారింది. ఇంత భారీ స్థాయిలో ఫలితాలు రావడానికి కారణం జైమానే అని చెప్పుకొంటున్నారు.
జైమా జర్నాజ్..
జైమా జర్నాజ్.. తారిక్ రెహమాన్ దంపతులకు ఏకైక కుమార్తె. ప్రస్తుతం వయసు 28 ఏళ్లు. లండన్ క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయపట్టా పొందింది. నిన్నామొన్నటిదాకా ఆమె అంతగా పరిచయం లేని పేరు. కానీ బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీనింతటికి ఎన్నికల ప్రచారంలో తండ్రికి చేదోడు..వాదోడిగా దూసుకుపోవడమే కారణం.
Also Read

17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ కుటుంబం లండన్ నుంచి ఢాకాకు ఇటీవలే వచ్చారు. ఇంతలోనే తల్లి, దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా చనిపోయారు. ఆ దు:ఖంలో ఉండగానే ఎన్నికలు వచ్చేశాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. అంతే బంగ్లాదేశీయులను తమ వైపుకు తిప్పికున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానంటూ హామీ ఇవ్వడంతో ఏకపక్షంగా ప్రజలు మద్దతు తెలిపారు.

ఇక జైమా కూడా ఢాకాలో ప్రచారంలో దూసుకుపోయింది. తండ్రి తరపున ప్రచారం నిర్వహించింది. వీధుల్లో రిక్షా తొక్కుతూ ప్రజలను కలుస్తూ.. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించింది. వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. యువ నాయకురాలి కావడంతో ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. ఖలీదా జియా తర్వాత కొత్త ముఖం కావడంతో బాగా ఎట్రాక్షన్‌గా నిలిచింది. పార్టీ సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంది. దాదాపు 30 మిలియన్లకు పైగా యువ ఓటర్లను ఆకట్టుకోగలింది. నాయనమ్మ ఖలీదా జియా జ్ఞాపకార్థం కవితలు, ఫొటోలు, భావోద్వేగ సంబంధాలను సోషల్ మీడియాలో పంచుకుంది. బాగా విపరీతంగా వైరల్ కావడంతో యువత బాగా ఆకర్షితులయ్యారు. చివరికి బీఎన్పీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
শারীরিক, মানসিক, বুদ্ধিবৃত্তিক প্রতিবন্ধীদের সাথে মতবিনিময় করেছেন জাইমা রহমান। #ZaimaRahman#Bangladesh pic.twitter.com/dd7NnwmlYu
— Masud Rana (@MasudRana137969) February 3, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?