రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భయాందోళనలు కలిగిస్తున్నది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా దళాలు వేగంగా కీవ్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా అది ఎంతసేపు అన్నది ఎవరూ చెప్పలేరు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాలిబన్లు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తాలిబన్లు హెచ్చరించారు. సమస్యలను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తాలిబన్లు ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఆఫ్ఘన్ ప్రజలు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Read: Ukraine President: కమెడియన్‌గా జీవితాన్ని ప్రారంభించి… అధ్యక్షుడిగా ఎదిగిన జెలెస్కీ…
