తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక వారిలో మార్పు వచ్చిందని, 2001 కి ముందున్న పాలనను అమలు కాదని, అందరికి క్షమాభిక్ష పెడుతున్నామని ప్రకటించారు. ప్రజల ఆస్తులు, వారి హక్కులు కాపాడాలని తాలిబన్లు కోరారు. దీంతో అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకున్నారు. తాలిబన్లు చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగా ఉన్నది. ప్లకార్డులు చేతబట్టి తమ హక్కులు కాపాడాలని కోరిన మహిళను అందరిముందు నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. కొన్ని చోట్ల రోడ్డుమీదనే మహిళలను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. అంతేకాదు, ఈరోజు జలాలాబాద్‌లో ఆందోళన చేస్తున్న ప్రజలపై తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి తమ కౄరత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ కాల్పుల్లో ఎంత మంద మరణించి ఉంటారన్నది తెలియాల్సి ఉన్నది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
క్షమాభిక్ష పెట్టామని అంటూనే… కాల్పులు జరుపుతున్న తాలిబన్లు…
