Site icon NTV Telugu

అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీకి ఆఫ్ఘ‌న్ రక్షణశాఖ‌.. తాలిబ‌న్ సంచలన నిర్ణయం…

ఆఫ్ఘ‌నిస్తాన్ ను తాలిబ‌న్లు అక్ర‌మించుకొని ప‌దిరోజులైంది.  అధికార బ‌ద‌లాంపు ప్ర‌క్రియ దాదాపుగా పూర్త‌యిన‌ట్టు స‌మాచారం.  ఆఫ్ఘ‌న్ అధ్య‌క్షుడిగా ముల్లా బ‌రాద‌ర్ ను నియ‌మించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి.  ఆయ‌న పేరు ముందు వ‌ర‌స‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.  ఇక కీల‌క‌మైన ర‌క్ష‌ణ‌, ఆర్ధిక శాఖ‌ల‌ను తాలిబ‌న్ల‌కు న‌మ్మ‌క‌మైన వ్య‌క్తుల‌కు అప్ప‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.  గ‌తంలో అమెరికాలోని గ్వాంటెనామో బే జైల్లో ఖైదీగా శిక్ష‌ను అనుభ‌వించిన ముల్లా అబ్దుల్ ఖ‌య్యుం జ‌కీర్‌కు అప్పగించ‌బోతున్నారని స‌మాచారం.  2001లో అమెరికా ద‌ళాలు తాలిబ‌న్ల‌పై దాడి చేసిన స‌మ‌యంలో ఖ‌య్యుం జ‌కీర్ లొంగిపోయారు.  ఆయ‌న్ను ఖైదీగా గ్వాంటెనామో బే జైల్లో ఉంచారు.  ప్ర‌పంచంలో అత్యంత క‌ఠిన‌మైన జైలుగా గ్వాంటెనామో బే జైలుకు పేరున్న‌ది.  అక్క‌డ క‌ర‌డుగ‌ట్టిన ఖైదీల‌ను ఉంచుతారు.  ఆ జైల్లో జ‌కీర్ ఏడేళ్లు ఉన్నాడు.  అక్క‌డి నుంచి ఆయ‌న్ను ఆఫ్ఘ‌న్‌లోని పౌల్ ఇ చ‌ర్ఖీ జైలుకు త‌ర‌లించారు.  అయితే, ఒత్తిళ్ల కార‌ణంగా ఆయ‌న్ను 2008 లో ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.  ఈ త‌రువాత జ‌కీర్ తాలిబ‌న్ల‌తో కలిసిపోయారు.  హెల్మాండ్‌, నిమ్రూజ్ ప్రావిన్స్‌లోని ద‌ళాల‌కు ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హించారు.  ప్ర‌స్తుతం తాలిబ‌న్ల కీల‌క నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు.  

Read: వ్యాక్సిన్ తీసుకోకుంటే జీతం కట్‌… ఎయిర్‌లైన్స్ సంస్థ కీలక ప్ర‌క‌ట‌న‌…

Exit mobile version