Dining Scam: రెస్టారెంట్, హోటల్.. ఇలా ఎక్కడైనా బిల్లు చెల్లించలేక పోతే.. వాళ్లతో.. పిండి రుబ్బిస్తారని.. అక్కడ పని చేస్తారని విన్నాం.. కొన్నిసార్లు చూశాం కూడా.. అయితే, రెస్టారెంట్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్ పీకల వరకు లాగించి.. బిల్లు నుంచి తప్పించుకోవడానికి చేసిన ఓ కన్నింగ్ ఐడియా ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. సిడ్నీలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ బిల్ చెల్లించకుండా ఉండటానికి, ఒక వ్యక్తి తన జుట్టును ఆహారంలో కలిపాడు. ఈ ఘటనను రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపెట్టింది.
Read Also: Muhammad Yunus: దిగిపోతూ, భారత్‌పై యూనస్ అక్కసు..‘‘7 సిస్టర్స్ కామెంట్స్’’..
ఆరుగురికి సంబంధించిన బిల్లును ఎగవేయాలని ప్లాన్ చేసి.. తమ వెంట్రుకలను కలిపారు.. $600 బిల్ చెల్లించకుండా ఉండేందుకు ప్రయత్నించారు.. అయితే, వారి దోపిడీ CCTVలో రికార్డు అయ్యింది. పోనీ డైనింగ్ రెస్టారెంట్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఆ ఫుటేజ్‌ను ప్రజల ముందు పెట్టింది.. వీడియోలో తెల్లటి చొక్కా, లేత గోధుమ రంగు ప్యాంట్ వేసుకున్న ఒక వ్యక్తి, తన ప్లేట్ వైపుకు చేరుకుని వెంట్రుకలను తన భోజనంలో ఉంచుతున్న దృశ్యాలు కనిపించాయి. రెస్టారెంట్ మేనేజర్ వివరించారు, ఆ బృందం అత్యంత ప్రీమియం వంటకాలు, డ్రై-ఏజ్డ్ స్టీక్, టోమాహాక్ కట్స్‌లను ఆర్డర్ చేశారు. మొత్తం బిల్ $600 దాటింది.
ఇక, రెస్టారెంట్ మీడియా ప్రకటనలో ఇలా పేర్కొంది.. “భోజనం ముగిసిన తర్వాత, ఒక అతిథి ఆహారంలో జుట్టు ఉందని ఫిర్యాదు చేసి డబ్బు చెల్లించడానికి నిరాకరించాడు. ఫిర్యాదు వచ్చిన వెంటనే CCTV ఫుటేజ్ పరిశీలించాము. తరువాత బాధితులు డబ్బు చెల్లించకుండా వెళ్లిపోయారు. ఇది ఇతర రెస్టారెంట్లకు అవగాహన పెంచడానికి షేర్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు.. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రెస్టారెంట్లు, కస్టమర్లు మరియు సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించి వివిధ వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా బిల్లు వేయడానికి ఆ ఫ్యామిలీ చేసిన కన్నింగ్ ఐడియా.. సోసల్ మీడియాలో వారి పరువు పోయేలా చేసింది..
