NTV Telugu Site icon

Switzerland: స్విట్జర్లాండ్‌లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!

Burqaban

Burqaban

నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దేశ వ్యాప్తంగా బురఖాపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. బురఖాపై ప్రజల నుంచి ప్రభుత్వం రిఫరెండం తీసుకుంది. దాదాపు దేశవ్యాప్తంగా 51.2 శాతం మంది ఓటర్ల ఆమోదం పొందిన 4 సంవత్సరాల తర్వాత బురఖా నిషేధ చట్టాన్ని స్విట్జర్లాండ్ అమలులోకి తెచ్చింది. మొత్తానికి సరికొత్త విధానంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి స్వాగతం పలికింది.

ఇది కూడా చదవండి: West Bengal: మమతా బెనర్జీ సన్నిహితుడి హత్య..

బురఖా నిషేధంపై తొలుత ప్రభుత్వ ప్రతిపాదనపై వ్యతిరేకత వచ్చింది. మహిళలు ఏం ధరించాలో.. నిర్దేశించే అధికారం లేదని వాదనలు వినిపించాయి. దీంతో 2021లో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది. అయితే బహిరంగంగా ముఖాలు కప్పుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకించారు. నిషేధానికి అనుకూలంగా 51.2 శాతం ఓట్లు వేశారు. వ్యతిరేకంగా 48.8 శాతం మంది వేశారు. అయితే గత నవంబర్‌లో దీన్ని చట్టం చేశారు. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత న్యూఇయర్ వేళ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 1,000 స్విస్ ఫ్రాంక్‌ల వరకు (రూ.94,000) జరిమానా విధించనున్నారు.

ఇది కూడా చదవండి: Shankar Daughter : నాన్న సినిమాకి పోటీగా రంగంలోకి శంకర్ కూతురు..

బురఖా నిషేధానికి మార్చి 2021లో ఓటర్లు మద్దతు ఇచ్చారు. దీన్ని 2024, నవంబర్‌లో ప్రభుత్వం చట్టం చేసింది. బురఖా నిషేధం అనేది కొత్త రాజ్యాంగ ఆర్టికల్‌లో ఒక భాగంగా అయింది. ఇక ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించడానికి నిరాకరించిన వారు కొత్త విధానానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ నిషేధం.. విమానాల్లో గానీ, దౌత్య మరియు కాన్సులర్ ప్రాంగణాల్లో గానీ వర్తించదు. ప్రార్థనా స్థలాలు, వ్యక్తిగత స్థలాల్లో మాత్రం ముఖాలు కప్పుకునే అవకాశం ఉంది. బహిరంగ స్థలాల్లో మాత్రం బురఖా ధరించడానికి అవకాశం ఉండదు.

ఇది కూడా చదవండి: Minister Seethakka: రేపు ప్రజాభవన్‌లో సంచార చేప‌ల విక్రయ వాహ‌నాల ప్రారంభం..

Show comments