Site icon NTV Telugu

Gun Firing: అమెరికాలో మరోసారి పేలిక తుపాకీ.. ఇద్దరు మృతి

America Gun Fire

America Gun Fire

Suspect Arrested For Shooting And Killing 2 People Near University Of Florida Campus: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాను గన్ కల్చర్ వణికిస్తోంది. ఈ విష సంస్కృతి ఆ అగ్రరాజ్యాన్ని లోలోపలే పీక్కు తింటోంది. వరుసగా అక్కడ కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత ఘటనకు సంబంధించిన నెత్తుటి మరఖలు ఆరకముందే, తుపాకీలు పేలుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి అమెరికాలో తుపాకీ తూటా పేలింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన గైనస్‌విల్లేలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగింది.

75 Hard Fitness Challenge: పాపం టిక్‌టాకర్.. అతిగా నీళ్లు తాగింది, ఆసుపత్రిపాలైంది

ఆదివారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో.. వెస్ట్ యూనివర్శిటీ అవెన్యూలోని చెకర్స్ & బాడీటెక్ సమీపంలో ఉన్న గైనెస్‌విల్లే పోలీసులు తుపాకీ కాల్పుల శబ్దం విన్నారు. దీంతో.. వీళ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. జాజియర్ మైయర్స్ అనే నిందితుడు ఈ కాల్పుల జరిపాడని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులపై అతడు కాల్పులు జరపగా.. ఇద్దరు స్పాట్‌లోనే మరిణించారు. మూడో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా మైయర్స్ కాల్పులు జరిపాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో మైయర్స్ అనుమానంగా కనిపించడంతో.. అతడ్ని ప్రశ్నించారు. మొదట్లో తనకు ఈ సంఘటనతో సంబంధం లేదన్నట్టుగా మైయర్స్ వ్యవహరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అతడే ఈ కాల్పులు చేశాడని నిర్ధారించుకొని, అతడ్ని అరెస్ట్ చేశారు.

Labour Shramik Card: లేబర్ కార్డును ఎలా అప్లై చేసుకోవాలి.. దాని వల్ల ప్రయోజనాలేంటి?

మరోవైపు.. ఇండియానాలోని మున్సీలోనూ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఒక పార్టీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 19 మంది గాయపడ్డారు. అటు.. మిషిగన్‌లోని లాన్సింగ్‌లోనూ అదే సమయంలో కాల్పులు చోటు చేసుకోగా, ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

Exit mobile version