NTV Telugu Site icon

Sunita Williams: అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న వ్యోమగామి సునీతా విలియమ్స్‌..

Sunitha

Sunitha

Sunita Williams: బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారు ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారు. పౌరులుగా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు తాము ఎదురు చూస్తున్నాం.. ఐఎస్‌ఎస్‌లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.. నాకే కాదు ఇది నా ఫ్యామిలీకి కఠినమైన సమయం.. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని సునీత విలియమ్స్ అన్నారు.

Read Also: Devara : ఇప్పటివరకు ఓవర్సీస్ లో దేవర క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే..

కాగా, మరో వ్యోమగామి విల్మోర్‌ మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్‌ రిక్వెస్ట్‌ పంపినట్లు చెప్పుకొచ్చారు. జూన్‌ 5వ తేదీన బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్, విల్‌మోర్‌లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్‌ ప్రకారం భూమికి తిరిగి రాలేదు. వీరిని తీసుకెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ మాత్రం సెప్టెంబర్‌ 6వ తేదీన భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకు వస్తుందని నాసా వర్గాలు చెప్పుకొచ్చాయి.