ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో టెక్ దిగ్గజానికి భంగపాటు ఎదురైంది. గ్రాడ్యుయేషన్‌లో సుందర్ పిచాయ్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగి గందరగోళం సృష్టించారు. వేడుక నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. పట్టభద్రత గౌన్లు, టోపీలు ధరించి స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ‘పాలస్తీనాకు స్వేచ్ఛ.. స్వేచ్ఛ’ అంటూ నినాదాలు చేశారు. గాజాకు విముక్తి కావాలంటూ అమ్మాయిలు, అబ్బాయిలు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా స్టేడియంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుందర్ పిచాయ్ కూడా స్టాన్‌ఫోర్డ్ పూర్వ విద్యార్థే ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దాదాపు 200 మంది విద్యార్థులు నిరసన తెలిపి బయటకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరిగింది. దీనికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను ముఖ్య అతిథిగా యాజమాన్యం ఆహ్వానించింది. అయితే సుందర్ పిచాయ్ లేచి ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ గురించి మాట్లాడుతూ.. తన పేరులోని చివరి రెండు అక్షరాలు కూడా ఏఐ (AI) అని అన్నారు. ఇలా ప్రసంగిస్తుండగా విద్యార్థుల నుంచి ఒక్కసారిగా అలజడి మొదలైంది. గాజాలో యుద్ధానికి టెక్ కంపెనీలే కారణమంటూ అల్లరి చేయడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్‌కు టెక్ కంపెనీలు సహకరించడం వల్లే విధ్వంసం జరిగిందని ఆరోపించడం మొదలు పెట్టారు. దీంతో విద్యార్థులంతా నిరసనగా వాకౌట్ చేసి పాలస్తీనా స్వేచ్ఛ అంటూ నినాదాలు చేసి బయటకు వెళ్లిపోయారు. విద్యార్థులంతా ఒకవైపు వెళ్లిపోతున్నా.. ఆశ్చర్యంగా ఇంకోవైపు పిచాయ్ ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. వీడియోలు వైరల్‌గా మారాయి.
Stanford grads walk out as Google CEO Sundar Pichai takes the stage as commencement speaker. No mention of AI, unlike other uni speakers getting booed down this year. Story for @sfgate shortly pic.twitter.com/qvS2rJ91Ip
— Matt Brown (@maattttbrown) June 14, 2026

