Sunami in Indonesia: డిసెంబరు 26, 2004 రాత్రి, 9.1-9.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద సునామీలలో ఒకటి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ అలలు ఎగిసిపడడంతో ఇండోనేషియాలో తెల్లవారుజామున పుట్టిన ఆవిపత్తు ఆ దేశంతో పాటు మరికొన్ని దేశాల ప్రజలను చీకట్లోకి నెట్టేసింది. అప్పట్లో సమర్థమంతమైన వార్నింగ్ సిస్టమ్స్ లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అదే బాక్సింగ్ డే సునామీ/ఇండియన్ ఓపెన్ సునామీ. నేటితో ఈ విషాదానికి 18 ఏళ్లు. ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల్లో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన సునామీ లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విపత్తు 14 దేశాలపై ప్రభావం చూపింది. 2,27,000 మందికిపైగా చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇండోనేషియాలోని సుమిత్రకు పశ్చిమ తీరాన 250 కిలోమీటర్ల దూరంలో 30 మీటర్ల లోతులో పుట్టిన భూకంపం ఫలితమే ఈ విధ్వంసం.
ఇండియా టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలతో ఈ భూకంపం పుట్టింది. అప్పుడు పుట్టిన ఎనర్జీ హిరోషిమాపై అమెరికా వేసిన ఆటమ్ బాంబ్ కంటే 23వేల రెట్లు ఎక్కువట. 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడిన ఈ అలలు గంటల వ్యవధిలో తూర్పు ఆఫ్రికా తీరం వరకు చేరుకున్నాయి. ఆ అలలు 8.67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయట. రిక్టర్ స్కేలుపై 9.1-9.3గా నమోదైన ఆ భూకంపం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ ఇదే అత్యంత ప్రమాదకరమైన సునామీ. అత్యధికంగా ఇండోనేషియాలో దాదాపు 2,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా.. శ్రీలంకలో 35,322, మన దేశంలో 16,269, థాయ్లాండ్లో 8212 మంది ఈ సునామీకి బలయ్యారు. సోమాలియా, మాల్దీవ్స్, మలేషియా, మయన్మార్, టాంజానియా, బంగ్లాదేశ్, సీషెల్స్, సౌతాఫ్రికా, యెమెన్, కెన్యా దేశాల్లో కూడా ప్రాణనష్టం నమోదైంది. రూ.82.5 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2004లో ఆ విపత్తును కళ్లారా చూసిన వాళ్లకు ప్రశాంతంగా ఆహ్లాదాన్ని పంచే సముద్రాన్ని చూస్తుంటే ఇప్పటికీ ఆ విషాద ఛాయలు వెంటాడుతున్నాయి.
1880లలో భారతదేశాన్ని తాకిన చివరి పెద్ద సునామీ గురించి పెద్దగా తెలియదు. 1945లో పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ కూడా పేలవంగా నమోదు చేయబడిందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేష్ నాయక్ తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, భారతదేశంలో 10,136 మంది మరణించారు, అత్యధిక మరణాలు తమిళనాడు నుండి నమోదయ్యాయి. అయితే, అనధికారిక అంచనాల ప్రకారం వాస్తవ సంఖ్య 18,000 మందికి పైగా ఉండవచ్చన్నారు. భారతదేశంలో రెండవ అత్యంత ప్రభావిత ప్రాంతం అండమాన్, నికోబార్ దీవులు, అధికారిక మరణాల సంఖ్య 1,300కి చేరుకుంది, 5,500 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దాని వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. దేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, అండమాద్ దీవులలోని బారెన్ 1, భూకంప కార్యకలాపాల ఫలితంగా డిసెంబర్ 30న విస్ఫోటనం చెందింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Droupadi Murmu: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే..