China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Women: “మంచి ఉద్యోగం ఉంది.. ఏడాదికి రూ.58 లక్షల సంపాదన ఉంది.. సమాజంలో ఉన్నత హోదా ఉంది.. కానీ, పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు!” వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. “ప్లీజ్.. నన్నెవరైనా పెళ్లి చేసుకోండి” అంటూ ఒక కోటీశ్వరురాలు రోడ్డుపై గుక్కపెట్టి ఏడ్చిన హృదయవిదారక దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. కేవలం 30 ఏళ్లు దాటాయనే ఒకే ఒక్క కారణంతో, ఆమె సాధించిన విజయాలన్నింటినీ పక్కన పెట్టి చైనా సమాజం ఆమెను ఎలా వెలివేసిందో చూపే షాక్‌కు గురవుతారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చైనాలోని సాంప్రదాయ వివాహ మార్కెట్ (Bride’s Market) లో ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన కొడుకులకు వధువును వెతకడానికి పొరుగు నగరం నుంచి వచ్చిన కొందరు తల్లిదండ్రుల ముందు ఆమె తన బాధను వెళ్లగక్కింది. “నేను ఏడాదికి 5,00,000 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.58 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాను. మంచి ఉద్యోగం ఉంది, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాను. కానీ నాకు 30 ఏళ్లు దాటాయనే ఒకే ఒక్క కారణంతో నన్నెవరూ పట్టించుకోవడం లేదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చైనా సమాజంలో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలను ‘షెంగ్ ను’ (Sheng Nu) లేదా ‘లెఫ్ట్ ఓవర్ ఉమెన్’ (మిగిలిపోయిన మహిళలు) అని పిలుస్తారు.
Also Read
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
వారు ఎంతటి ఉన్నత చదువులు చదివినా, కెరీర్లో ఎంతటి విజయాలు సాధించినా.. వయసు ముదిరిందనే కారణంతో పెళ్లికి పనికిరారని అక్కడి సాంప్రదాయ కుటుంబాలు భావిస్తాయి. మహిళల విజయాల కంటే వారి వయసుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ ఆలోచనా విధానంపై, ఆధునిక చైనీస్ యువతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంపాదన, అర్హత అన్నీ ఉన్నా.. వయసును బట్టి జీవిత భాగస్వామి అర్హతను నిర్ణయించడం ఎంతవరకు న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు తెరలేపింది.
A Chinese "leftover" Woman has a meltdown at weekly bride's market in China
She pleads her case with parents of potential groom's, who have travelled from neighbouring city to look for a bride for their Sons
She shouts that she earns 500,000 Yuan and has a good job, yet no one… pic.twitter.com/yGEzRcqdzw
— Muji Singh Rangi (@mujifren) June 17, 2026
తాజావార్తలు
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!