7.1 తీవ్రతతో బలమైన భూకంపం ఫిలిప్పీన్స్‌ను తాకింది.. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో ఈ భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది… పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. ఇంత భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పుడు.. సాధారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వివిధ ఏజెన్సీలు పేర్కొన్నాయి..
ఫిలిప్పీన్స్ అధికారులు మొదట్లో సునామీ తప్పేలాలేదని అంచనా వేశారు.. అయితే, యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ మరియి హవాయి ఎమర్జెన్సీ మేనేజెట్‌మెంట్ యూఎస్ వెస్ట్‌కోస్ట్.. సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశాయి.. కాగా, పసిఫిక్ రింగ్‌లో ఉన్న ఫిలిప్పీన్స్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే, తాజాగా ఇవాళ ఉదయం సంభవించిన భూకంపం వల్ల.. నష్టం ఎంతమేర జరిగింది… ఆస్తినష్టం ఎంత..? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
