1994లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అమెరికా, నాటో దళాలు తాలిబన్లపై యుద్దం ప్రకటించిన తరువాత తాలిబన్లు వేగంగా వైదొలిగారు. 20 ఏళ్లు ప్రజాస్వామ్య పాలన సాగింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమెరికా ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. కేవలం పది నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక సరా ఖేటా అనే దళం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఫష్తో భాషలో సరాఖేటా అంటే అరుణదళం అని అర్ధం.
Read: తెలంగాణలో ఇంటింటికీ వ్యాక్సిన్…!!
సహజసిద్ధమైన తాలిబన్లలో నుంచి కొంతమందిని ఎంపిక చేసి వారికి కమాండో శిక్షణ ఇచ్చారు. అధునాతన ఆయుధాలను ఎలా వినియోగించాలి, కీలక సమయంలో ఎలా పోరాటం చేయాలి అనే విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. వీరు ఎలాంటి దుర్భర పరిస్థితులనైనా ఎదుర్కొని టార్గెట్ ను ఛేదిస్తుంటారు. కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకొవడంలో వీరి పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. తలకు ఎర్రని గుడ్డను కట్టుకొని ఆధునిక ఆయుధాలను చేతబూని చేతులకు గ్లౌజ్‌లు ధరించిన వీరు ఎలాంటి లక్ష్యాలనైనా ఛేదించేందుకు సదా సిద్ధంగా ఉంటారు. వేగంగా ప్రయాణం చేసేందుకు వీరికి ప్రత్యేక వాహనాలను సమకూర్చింది తాలిబన్.
