Site icon NTV Telugu

Storm Eunice: యూర‌ప్‌లో దారుణం… రోడ్డుపై ప‌డిపోతున్న ప్ర‌జ‌లు…

యూర‌ప్‌లో యూనిస్ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వ‌ణికిపోతున్న‌ది. గంట‌కు 196 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండ‌టంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. రోడ్డుపై న‌డుస్తున్న వ్యక్తులు గాలులు ధాటికి రోడ్డుపైనే ప‌డిపోతున్నారు. ఇక ఈ ఈదురుగాలుల‌కు విమానాలు ఊడిపోతున్నాయి. పైక‌ప్పులు ఎగిరిపోతున్నాయి. యూర‌ప్‌లో ఎటు చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ తుఫాన్ ధాటికి ఇప్ప‌టికే సుమారు 9 మంది మృతి చెందారు. భారీ వృక్షాలు నేల‌కొరిగాయి. క‌రెంటు వైర్లు తెగిప‌డిపోవ‌డంతో ప‌లు ప్రాంతాల్లో క‌రెంట్ కోత‌లు ఏర్పడ్డాయి. యూనిస్ తుఫాన్ కార‌ణంగా అనేక దేశాల్లోని తీర ప్రాంతాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read: TRS vs BJP : ఘర్షణలో గాయపడ్డ పోలీస్‌..

Exit mobile version