NTV Telugu Site icon

T Coronae Borealis: విశ్వంలో మహా విస్పోటనం.. పేలడానికి సిద్ధంగా ఉన్న నక్షత్రం.. మనము చూడొచ్చు..

T Coronae Borealis

T Coronae Borealis

T Coronae Borealis: మన జీవితంలో ఎప్పుడూ చూడని, జరగని సంఘటన విశ్వంలో చోటు చేసుకోబోతోంది. ప్రస్తుతం T కరోనియా బొరియాలిసిస్(T CrB) అనే నక్షత్రం పేలేందుకు సిద్ధమైంది. ఇది భూమి నుంచి 3000 కాంతి సంవత్సరాల దూరంలో కరోనా బోరియాలిస్ (నార్తర్న్ క్రౌన్) అనే నక్షత్రరాశిలో ఉంది. T CrB ఒక బైనరీ నక్షత్ర వ్యవస్థలో భాగంగా ఉంది. ఇందులో ఒక భారీ రెడ్ జాయింట్ నక్షత్రం చుట్టూ తెల్లని మరగుజ్జు( వైట్ డార్ఫ్) నక్షత్రం తిరుగుతోంది. ఈ నక్షత్రం ఇప్పటి నుంచి సెప్టెంబర్ 2024 మధ్య విస్పోటనం చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని మనం ఎలాంటి పరికాలు అవసరం లేకుండా కంటితో చూడొచ్చు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే సంఘటనగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

Read Also: Chevireddy Mohith Reddy: తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి మోహిత్ రెడ్డి రాజీనామా!

T CrB చివరిసారిగా 1946లో పేలింది. ఆ పేలుడుకు దాదాపు ఒక సంవత్సరం ముందు, వ్యవస్థ అకస్మాత్తుగా మసకబారింది. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు ‘‘ప్రీ-ఎరప్షన్ డిప్’’గా పిలుస్తారు. 2023లో మరోసారి ఇది మసకబారింది. ఇది కొత్తగా విస్పోటనాన్ని సూచిస్తోంది. ఇప్పటి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మ్యాగ్నిట్యూడ్ +10 (నేకెడ్-ఐ విజిబిలిటీకి మించి) నుండి మాగ్నిట్యూడ్ +2 వరకు గణనీయంగా ప్రకాశించే అవకాశం ఉంది. దీని ప్రకాశం పొలారిస్ (నార్తర్న్ స్టార్) నక్షత్రంలా ఉంటుంది. పొలారిస్ ఆకాశంలో ప్రకాశవంతంగా ఉండే 48వ నక్షత్రం. నక్షత్ర విస్పోటనం తర్వాత కొన్ని రోజుల వరకు ఇది ప్రకాశిస్తూ కనిపిస్తూనే ఉంటుంది.