Srilanka: 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లు.. ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గగనతలంలో విమానాలు ఢీకొనే పెను ప్రమాదాన్ని తప్పించి 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని పైలట్ల అప్రమత్తతతో తుర్కియే గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి 275 మంది ప్రయాణికులతో కొలంబో బయలుదేరింది. విమానం టర్కీ గగనతలం పైనుంచి 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని 35 వేల అడుగులకు తీసుకెళ్లాలని అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్లకు ఆదేశాలు అందాయి.
అయితే, అదే ఎత్తులో మరో విమానం వస్తోందని, కేవలం 15 మైళ్ల దూరంలోనే ఉందని శ్రీలంక పైలట్లు గుర్తించారు. వెంటనే వారు ఆ విషయాన్ని ఏటీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఏటీసీ కేంద్రానికి తెలియజేశారు. కానీ ఏటీసీ వ్యవస్థ మాత్రం పైకి ఎగరడానికి రెండు సార్లు క్లియరెన్స్ ఇచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. ట
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
పొరపాటును గుర్తించిన ఏటీసీ కేంద్రం పైకి ఎగరవద్దని, అదే ఎత్తులో దుబాయ్‌కు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 250 మంది ప్రయాణికులతో వస్తోందని సమాచారం ఇచ్చింది. ఏటీసీ వ్యవస్థ ఆదేశాల ప్రకారం పైలట్లు విమానాన్ని 35 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి ఉంటే, రెండు విమానాలు ఢీకొని పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఏటీసీ తొలుత ఇచ్చిన ఆదేశాలను పైలట్లు గుడ్డిగా పాటించి ఉంటే 525 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయి ఉండేవంటూ శ్రీలంక ఎయిర్‌లైన్స్ బుధవారం వెల్లడించింది. పైలట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రశంసించింది.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!