Site icon NTV Telugu

Srilanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన.. అల్లాడిపోతున్న ప్రజలు

Srilanka

Srilanka

శ్రీలంకలో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో సాధారణ ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అధ్యక్షుడు రాజపక్సే భవానాన్ని చుట్టుముట్టి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అటు పలు హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాగా కరోనా మహమ్మారి సమయంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది.

https://ntvtelugu.com/mafia-eye-for-women-refugees-in-ukraine/

Exit mobile version