Site icon NTV Telugu

Srilanka Crisis: విదేశాలకు పారిపోయే యోచనలో శ్రీలంక ప్రధాని

Mahindra Rajapaksa

Mahindra Rajapaksa

ప్రస్తుతం శ్రీలంకలో రావణ కాష్టంలా రగిలిపోతోంది. ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ప్రజలంతా కలిసి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రధాని రాజపక్సే ఇంటి వద్ద ప్రజలు తీవ్ర దాడులకు పాల్పుడుతున్నారు. దీంతో రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రధాని పదవి రాజీనామా చేయాలని అల్టీమేటం కూడా వస్తోంది. దీంతో ప్రధాని రాజపక్సే విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

మరోవైపు శ్రీలంకలో ఆహార ధరలు భారీగా పెరిగాయి. కిలో చక్కెర రూ.240కి చేరింది. కిలో బియ్యం ధర రూ.200 దాటింది. కిలో గోధుమల ధర రూ.190, లీటర్‌ కొబ్బరి నూనె ధర రూ.750, ఒక్కో కోడిగుడ్డుకు రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే పిల్లలకు సంబంధించిన పాలపొడి సైతం కిలో రూ.1900కు చేరింది. ఇక కూరగాయలు కొనలేని పరిస్థితి. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స, గోటబయ రాజపక్సపై దేశ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

https://ntvtelugu.com/sri-lanka-economic-crisis-main-opposition-party-to-move-no-confidence-motion/

Exit mobile version