స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా… 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగగానే రైల్వే సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
సోమవారం స్పెయిన్ దక్షిణ అండలూసియా ప్రాంతంలో ఒక హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి.. ఇంకో హైస్పీడ్ రైలును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాదాపు ఘటనాస్థలిలో 21 మంది ప్రాణాలు కోల్పోయిరు. మరో 73 మంది గాయపడినట్లు రైలు ఆపరేటర్ ఇర్యో చెప్పారు. మాలాగా-మాడ్రిడ్ సర్వీస్‌లో భాగంగా దాదాపు 300 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీవ్రమైన బాధతో కూడిన రాత్రిగా అభివర్ణించారు.
ఆదివారం సాయంత్రం మాలాగా దగ్గర రైలు ప్రారంభమై మాడ్రిడ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో ఆడమూజ్ సమీపంలో పట్టాలు తప్పి మరో ట్రాక్‌పైకి వెళ్లి పడింది. అదే సమయంలో మరొక రైలు రావడంతో ప్రమాదం జరిగింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అత్యవసర అధికారి ఆంటోనియో సాన్జ్ తెలిపారు. 30 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రి తరలించామని రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే వెల్లడించారు.
