NTV Telugu Site icon

FIFA Women World Cup: ముదిరిన ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ప్రధాని ఆగ్రహం

Fifa Kissing Controversy

Fifa Kissing Controversy

Spain President Pedro Sanchez Fires On FA president Luis Rubiales After Liss Controversy: ఫిఫా వుమెన్ వరల్డ్‌కప్-2023లో స్పెయిన్ జట్టు ఛాంపియన్‌గా అవతరించడంతో.. ఆ సంబరాల్లో స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ క్రీడాకారుణులకు ముద్దులు పెట్టిన విషయం తెలిసిందే. స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసోకి లిప్‌లాక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. జట్టు సభ్యులకు మెడల్స్ ఇస్తున్న సమయంలో ఆయన ఈ పని చేశారు. ఆయనిలా ముద్దులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. పెద్ద స్థాయిలో ఉన్నంతమాత్రాన.. ఇలా ఎలా ప్రవర్తిస్తారంటూ స్పెయిన్ వ్యాప్తంగా విమర్శలు వచ్చిపడుతున్నాయి. దీంతో.. తన చర్యకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పారు.

Pak On Chandrayaan-3: చంద్రయాన్‌-3 ప్రయోగంపై పాకిస్తాన్‌ ప్రశంసలు

అయితే.. ఈ క్షమాపణలు ఏమాత్రం సరిపోవని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఖెజ్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఆయన చెప్పిన క్షమాపణలు సరిపోవు. ఆ అభ్యంతరకర ప్రవర్తనపై మరింత స్పష్టత ఇవ్వాలి’ అని ప్రధాని అన్నారు. అయితే.. ఫెడరేషన్‌ స్వతంత్రంగా పనిచేస్తుందని, దాని ప్రెసిడెంట్‌ను తొలగించే అధికారం స్పెయిన్‌ ప్రభుత్వానికి లేదని అన్నారు. కానీ.. ఈ వ్యవహారంపై తాము ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. మరోవైపు.. తాను చేసిన పనికి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే లూయిస్ ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు. తమ జట్టు గెలిచిందన్న సంతోషంలో తాను అలా ముద్దులు పెట్టానని.. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టత ఇచ్చాడు. అయితే.. ఆయన సారీ చెప్పినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్లు వస్తున్నాయి.