రొటీన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ సమయంలో స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ పేలిపోయింది. పేలిపోగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని టెక్సాస్ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kannappa : ‘కన్నప్ప’ కి ఫైనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడంటే?
అమెరికాలోని టెక్సాస్‌లోని ఎలాన్ మస్క్‌కు సంబంధించిన వాణిజ్య అంతరిక్ష విమాన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో బుధవారం రొటీన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అంతే ఉన్నట్టుండి స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ పేలిపోయింది. ఈ ప్రమాదంతో స్పేస్‌ఎక్స్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ మేరకు స్పేస్‌ఎక్స్ ఎక్స్ ట్విట్టర్‌లో ప్రమాద దృశ్యాలను పోస్ట్ చేసింది. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది జరిగిందని పేర్కొంది. స్టార్‌షిప్ 10వ విమాన పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. చుట్టుపక్కల కమ్యూనిటీ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదని పేర్కొంది. ఎవరూ ఈ ప్రాంతాలకు రావొద్దని సూచించింది.
ఇది కూడా చదవండి: 1941, 2025 Calendar: 1941లో ఏం జరిగిందో, 2025 లో కూడా అదే జరుగుతుందా?.. వైరల్ అవుతోన్న 84 ఏళ్ల క్యాలెండర్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ నిర్వహించిన పలు ప్రయోగాలు ఇటీవల కాలంలో ఫెయిల్ అవుతున్నాయి. అంతరక్షింలోకి వెళ్తుండగా పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే పేలిపోవడం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.
Massive explosion as Ship 36 explodes on the Static fire test stand.
This will be a major setback as there is likely significant damage to the entire back half of Massey's pic.twitter.com/8cB7PRWI0e
— Zack Golden (@CSI_Starbase) June 19, 2025
