SP Hinduja: హిందూజా గ్రూప్ సంస్థల అధినేత శ్రీచంద్ పర్మానంద్ హిందూజా(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం లండన్ లో కన్నుమూశారు. నలుగురు హిందూజా సోదరుల్లో ఎస్పీ హిందూజా పెద్దవారు. ఆయన తర్వాత గోపీచంద్, ప్రకాష్, అశోక్ ఉన్నారు. భోఫోర్స్ కుంభకోణంలో గోపీచంద్, ప్రకాష్ ఇద్దరు ఈ కాంట్రాక్ట్ స్వీడిష్ గన్ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ కు వచ్చేలా 81 మిలియన్ల స్వీడన్ కరెన్సీని అక్రమ కమిషన్లుగా అందుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తర్వాత వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎస్పీ హిందూజా మరణించడంపై ఆయన కుటుంబం సంతాపాన్ని వ్యక్తం చేసింది.